Breaking News

నందిపేట్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

స్థానిక అధికారులతో కలిసి స్థల పరిశీలన

క్రీడా స్థలానికి అనువైన భూమిని గుర్తించాలని ఆదేశం

చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచన

బఫర్ జోన్‌లోని వెంచర్ల అనుమతులు రద్దు చేయాలని అధికారులకు ఆదేశం

బఫర్ జోన్‌లోని వెంచర్ల అనుమతులు రద్దు చేయాలని అధికారులకు ఆదేశం

మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

నందిపేట్, ఆగస్టు 7: E6 tv NEWS (శివ ఠాకూర్)
నందిపేట్ మండల కేంద్రంలో ఇటీవల మంజూరైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) ఏర్పాటుకు సంబంధించి గురువారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్థానిక అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, క్రీడల శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్, ఎంపీడీవో, ఎమ్మార్వో, ఇరిగేషన్, పంచాయతీ మరియు జిల్లా క్రీడల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, నందిపేట్ మండల కేంద్రానికి క్రీడా స్థలం మంజూరైన నేపథ్యంలో అందుకు అనువైన స్థలాన్ని త్వరితగతిన గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి అవసరమైన అదనపు భూములను కూడా పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.మండల పరిధిలో చెరువులను ఆక్రమించి భవనాలు నిర్మించడం లేదా వెంచర్లు ఏర్పాటు చేయడం వంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టం చేశారు. ఇటీవల ఏర్పాటైన వెంచర్లన్నింటినీ సర్వే చేసి వాటి హద్దులను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు తేలితే ఆయా వెంచర్లకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని సూచించారు.

అనంతరం నందిపేట్‌లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పటేళ్ల రాజు, పెయింటర్ రాజు, నాగ సురేష్, సాయి, కస్తూరి గంగాధర్, లక్కంపల్లి చిన్నయ్య, చింత శ్రీను, పెట్ల శీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *