ఎర్గట్ల, ఆగస్టు 23: (E6tv NEWS: T.గంగాధర్).
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఆదివారం జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎర్గట్ల మండలం తోర్తి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ ప్రేమలతకు ఉత్తమ అంగన్‌వాడీ టీచర్‌గా ప్రశంసా పత్రం అందజేశారు.అంగన్‌వాడీ కేంద్రంలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తూ, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించినందుకు గుర్తింపుగా ప్రేమలతకు ఈ ప్రశంసా పత్రాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రేమలతను జిల్లా అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అభినందించారు. తన సేవలను గుర్తించి ప్రశంసా పత్రం అందించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రేమలత తెలిపారు. భవిష్యత్తులోనూ మరింత బాధ్యతతో విధులు నిర్వహిస్తూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందిస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

