తెలంగాణలో కొత్తగా 41 బార్ అండ్ రెస్టారెంట్ల (2B) ఏర్పాటుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరిలతో కూడిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిలో 14 బార్లు, దేవరకద్ర, ఎల్లంపల్లి, మద్దూరు, గుమ్మడిదల వంటి ప్రాంతాలతో సహా ఇతర మున్సిపాలిటీల్లో 27 బార్లను కేటాయించారు. ఆసక్తి ఉన్నవారు రూ. 1,00,000 నాన్-రిఫండబుల్ రుసుముతో సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 12, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిలో విజేతలను ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు. ప్రాంతాన్ని బట్టి వార్షిక ఎక్సైజ్ పన్ను TCUR పరిధిలో రూ. 44 లక్షలు, బోధన్ వంటి ప్రాంతాల్లో రూ. 42 లక్షలు, ఇతర మున్సిపాలిటీల్లో రూ. 30 లక్షలుగా ఖరారు చేయగా, ఈ కొత్త బార్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా సుమారు రూ. 14.62 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.

