Breaking News

ఫార్మాసిటీ భూములపై ఫైర్.. ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద రైతుల ఉద్రిక్తత

ఇబ్రహీంపట్నంలో ఫార్మాసిటీ భూముల వ్యవహారం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ 2,500 ఎకరాల పట్టా భూములను నిషేధిత (22-ఏ) జాబితా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఫార్మాసిటీ బాధితులు, రైతులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ప్రధాన రహదారిపైకి వచ్చి నిరసన తెలపగా, ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ ప్రతిపాదించినప్పటికీ, ఒప్పందం కుదరని పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టడంతో రైతులు రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫార్మాసిటీ స్థానంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఈ భూములపై రికార్డుల పరిస్థితి ఏంటనే దానిపై స్పష్టత లేకపోవడమే ఈ వివాదానికి కారణమవుతోంది. కోర్టు ఆదేశాలు, న్యాయపరమైన అంశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వైఖరి తేల్చకపోవడం, ప్రతిపక్షాల మౌనంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *