Breaking News

ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ: దానం నాగేందర్‌పై అనర్హత వేటు!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఆ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు తెలంగాణ శాసనసభ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు తీర్పును అనుసరించి 2024 ఏప్రిల్ 23 నుంచే దానం నాగేందర్ సభ్యత్వం రద్దయినట్లు స్పష్టం చేసింది. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు పిటిషన్లు దాఖలు చేయగా… విచారించిన హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు ఆయనపై అనర్హత వేటును ఖరారు చేశాయి.

శాసనసభ గెజిట్ విడుదల చేయడంతో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సిట్టింగ్ స్థానం ఖాళీ కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఇక్కడ త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తన సభ్యత్వం రద్దయినప్పటికీ, ఉప ఎన్నిక వస్తే మళ్లీ పోటీ చేసి విజయం సాధిస్తానని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *