Breaking News

“ఆధారాలు బయటపెడతా”: KTR పై కవిత ఘాటు వ్యాఖ్యలు!

నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని కేసీఆర్ చెప్పడం వల్లే సమస్యలు తమ వరకు రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత (మాజీ ఎమ్మెల్సీ) కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లుగా కేటీఆర్ తన సొంత వైఫల్యాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తోసిపుచ్చుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు తాను ఒక అవినీతి నాయకుడిని విమర్శిస్తే సస్పెండ్ చేశారని, ఇప్పుడు అదే నాయకుడితో కేటీఆర్ అంటకాగుతూ పార్టీ అధినేత తీరునే తప్పుపట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా అని ప్రశ్నించారు.

అక్రమ పర్మిషన్లు, క్విడ్ ప్రో కో దందాలు మరియు ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చిన నజరానాలతో కేటీఆరే బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి నెట్టారని కవిత ఆరోపించారు. ఇటీవల జరిగిన సమాmeetingలలో రైతును, ఓ మహిళను అహంకారంతో అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడనని, తనతో పెట్టుకుంటే అన్ని ఆధారాలను బయటపెడతానని కేటీఆర్‌కు సంచలన హెచ్చరిక చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *