Breaking News

మేడారంలో హీరో నాని.. ‘ది ప్యారడైజ్’ టీమ్ ప్రత్యేక పూజలు!

‘ది ప్యారడైజ్’ చిత్ర కథానాయకుడు, ప్రముఖ సినీ నటుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించారు. ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం చేరుకున్న నాని బృందానికి గిరిజన పూజారులు సాంప్రదాయ డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. గద్దెల వద్ద సమ్మక్క-సారలమ్మ వనదేవతలకు నాని నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, చిత్ర నిర్మాత సుధాకర్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తదితరులు అమ్మవార్లను దర్శించుకుని తమ రాబోయే సినిమా విజయం సాధించాలని ప్రార్థించారు. నాని రాకతో మేడారం, ములుగు ప్రాంతాల్లో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *