Breaking News

‘మిషన్ కర్మయోగి’ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలో ‘మిషన్ కర్మయోగి’ దక్షిణ ప్రాంతీయ రెండు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో పరిపాలనా నైపుణ్యాలు పెంపొందించడం, సామర్థ్య పెంపుదల (Capacity Building) లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో అమలువుతున్న ఉత్తమ పాలనా విధానాలను, సంక్షేమ కార్యక్రమాలను పరస్పరం పంచుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *