ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎన్టీఆర్ భరోసా’ పథకం కింద నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు బాపట్ల జిల్లా రేపల్లెలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ‘పేదల సేవ’ కార్యక్రమంలో భాగంగా రేపల్లెలోని 4వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు సీఎం స్వయంగా పింఛన్లను అందజేసి వారితో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
పర్యటన ముగింపులో భాగంగా మధ్యాహ్నం రేపల్లె నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రానికి పర్యటన పూర్తి చేసుకుని సీఎం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బాపట్ల జిల్లా యంత్రాంగం మరియు పోలీసులు అన్ని రకాల భద్రతా, ఏర్పాట్లను పూర్తి చేశారు.

