Breaking News

హైడ్రా మరో మైలురాయి:నిజాం కాలపు బావి వెలుగులోకి..

హైదరాబాద్ పాతబస్తీలోని శివరాంపల్లి పరిధిలో ఉన్న 356 ఏళ్ల నాటి చారిత్రక ‘బుమ్-రుక్న్-ఉద్-దౌలా’ చెరువును ఇటీవలే పునరుద్ధరించిన ‘హైడ్రా’, ఇప్పుడు అదే చెరువు కింద ఉన్న 1.50 ఎకరాల విస్తీర్ణంలోని పురాతన ఊట బావికి ప్రాణం పోస్తోంది. మూడవ నిజాం సికందర్ జా పాలనలో (సుమారు 1770 లో) నిర్మితమైన ఈ బావి నీటిలో ఔషధ గుణాలు ఉండటంతో నిజాం పాలకులు సైతం ఈ నీటిని తాగేవారని, ఎడ్లబండ్లపై లండన్ వరకు కూడా తరలించినట్లు చారిత్రక కథనాలు ఉన్నాయి. ఇటీవల చెరువు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ బావి విశిష్టతను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీని పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయిన ఈ చారిత్రక బావిని ‘విమోస్ టెక్నోక్రాట్స్’ సంస్థ ఆధ్వర్యంలో హైడ్రా శరవేగంగా పునర్నిర్మిస్తోంది. మరో రెండు, మూడు నెలల్లో ఈ బావి పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. కేవలం వారసత్వ సంపదను కాపాడటమే కాకుండా, భవిష్యత్ తరాలకు నగర ప్రాచీన జల నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *