Breaking News

ఏపీ నా సొంత రాష్ట్రంలాంటిది:అనంత్ అంబానీ!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వెల్లడించారు. మదనపల్లెలో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’, ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ISA) శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “నన్ను మీ ఆంధ్రా బిడ్డగా భావించి, రాష్ట్రానికి నేనేం చేయాలో మార్గనిర్దేశం చేయండి” అని సీఎం నారా చంద్రబాబు నాయుడిని వినమ్రంగా కోరారు. అనంత్ ప్రసంగానికి మంత్రముగ్ధులైన సీఎం చంద్రబాబు ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఏపీలో వ్యవసాయ, సాంకేతిక అభివృద్ధికి రిలయన్స్ కట్టుబడి ఉందంటూ అనంత్ అంబానీ పలు కీలక ప్రకటనలు చేశారు:

  • రైతులకు సీఈఓ హోదా: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) తరహాలోనే ఏర్పాటయ్యే ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ద్వారా అన్నదాతలను తమ సొంత కమతాలకే సీఈఓలుగా మారుస్తామని తెలిపారు.
  • రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి: రిలయన్స్ గ్రీన్ బిజినెస్ ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్ల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి పెడుతున్నామని, రైతులకు ఆధునిక సాంకేతికతను అందిస్తామని స్పష్టం చేశారు.
  • ఏఐ, డ్రోన్ టెక్నాలజీ: ప్రెసిషన్ ఫార్మింగ్, ఏఐ, డ్రోన్లు మరియు రోబోటిక్స్ సాయంతో టమాటో రైతులకు మార్కెట్ విశ్లేషణను అందుబాటులోకి తెచ్చి రైతుల ఆదాయాన్ని పెంచుతామన్నారు.
  • ‘వంతారా’ ద్వారా పశు సంరక్షణ: ‘పశు సేవా హీ ప్రభు సేవా’ సూత్రంతో జీయో ‘కియో కృషి’ ద్వారా రైతులకు, ‘వంతారా’ ప్రాజెక్ట్ ద్వారా జంతు సంరక్షణకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వల్లే రాష్ట్రం వేగంగా పెట్టుబడులను ఆకర్షిస్తోందని అనంత్ అంబానీ కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *