Breaking News

తెలంగాణలో బార్లు, రెస్టారెంట్లు బంద్

తెలంగాణలో బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కొత్తగా విధిస్తున్న ‘ప్రివిలేజ్ సెస్’ను నిరసిస్తూ నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లను బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెస్ వల్ల ఒక్కో బార్‌పై ఏటా 8% నుంచి 20% వరకు (సుమారు రూ. 30 లక్షలు) అదనపు భారం పడుతుందని, ఇప్పటికే బెల్ట్ షాపులు, వైన్ షాపుల అనుమతుల వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా చెల్లించే రూ. 33 లక్షల నుంచి రూ. 56 లక్షల లైసెన్స్ ఫీజుకు తోడు ఈ కొత్త సెస్ వేయడం దారుణమని, ప్రివిలేజ్ సెస్‌ను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *