Breaking News

నేడు ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లావ్యాప్తంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు ప్రస్తుతం సాగుతున్న పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అలాగే ఖమ్మం నగరంలోని అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో 20 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పురోగతితో పాటు సాగునీటి సరఫరా, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించే అవకాశం ఉంది. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో, మంత్రి రాక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *