వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమ కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డి పరిణయ వేడుకకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ పెళ్లి వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానించే క్రమంలో వైఎస్ షర్మిల తన భర్త బ్రదర్ అనిల్ కుమార్‌తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ను ప్రత్యేకంగా కలిసి శుభలేఖను అందజేశారు. కుటుంబ సమేతంగా వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. తమిళనాడులో నటుడిగా, రాజకీయ నాయకుడిగా క్రియాశీల పాత్ర పోషిస్తున్న విజయ్ను కలవడం మర్యాదపూర్వకమైన కుటుంబ ఆహ్వానంగానే జరిగినా, ఈ భేటీ రాజకీయంగానూ, సినీ వర్గాల్లోనూ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఎం విజయ్‌కు షర్మిల దంపతుల పెళ్లి ఆహ్వానం

