Breaking News

అర్హులందరికీ ఓటు హక్కు: ఏపీలో ప్రత్యేక డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా నేటి నుంచి స్పెషల్ ఓటర్ డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత నమోదుతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లను చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా తమ చిరునామాల్లో అందుబాటులో లేరని గుర్తించిన దాదాపు 44.89 లక్షల మంది ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి సరిచూడనున్నారు. దీనికోసం బూత్ లెవల్ అధికారులు (BLO) నేరుగా ఇళ్లకు వెళ్లి విచారణ జరుపుతారు.

పరిశీలనలో అర్హత ఉన్నప్పటికీ పొరపాటున పేర్లు తొలగించినట్లు తేలితే, BLOలు వెంటనే ఫామ్-6 అందించి మళ్లీ పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. చిరునామా మార్పులు, ఇతర వివరాల సవరణలను కూడా ఈ డ్రైవ్‌లో పరిష్కరిస్తారు. అర్హులందరికీ అవగాహన కల్పిస్తూ చేపడుతున్న ఈ ప్రత్యేక డ్రైవ్ పూర్తయిన అనంతరం, ఈ నెల 16న ఏపీలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *