Breaking News

ఏపీ-తమిళనాడు సీఎంల సమావేశం

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం విజయవాడలో పర్యటించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు వచ్చిన సీఎం విజయ్.. అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లగా, సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు చర్చలు జరపగా.. తెలుగు గంగా ప్రాజెక్ట్ ద్వారా చెన్నై నగరానికి తాగునీటిని అదనంగా విడుదల చేయాలని సీఎం విజయ్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఏడాది ఎల్ నినో ప్రభావంతో కృష్ణా నదికి నీటి ప్రవాహం తగ్గి తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పటికీ, చెన్నై తాగునీటి అవసరాలను తీర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెన్నైకి 4.08 టీఎంసీల నీటిని విడుదల చేసిందని, లభ్యత మరియు అవసరాలను బట్టి మరింత నీటిని విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్రంలో గోదావరి-కావేరి నదుల అనుసంధానమే Drought (కరువు) సమస్యకు శాశ్వత పరిష్కారమని చంద్రబాబు అభివర్ణించారు.https://e6tv.in/#

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *