Breaking News

174 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్ స్మిత్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు!

ఫ్లై దుబాయ్ విమానంలో పెను ప్రమాదాన్ని అడ్డుకున్న భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ అసాధారణమైన ధైర్యం, సమయస్ఫూర్తితో వ్యవహరించి 9/11 తరహా తీవ్ర విషాదాన్ని అడ్డుకున్నారని కొనియాడారు. గురువారం ఢిల్లీలో జరిగిన యూపీఎస్సీ (UPSC) శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ… ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నట్లుగానే ఒక భారతీయుడు ప్రపంచాన్ని వణికించే గొప్ప ప్రమాదాన్ని నివారించాడని తెలిపారు. కెప్టెన్ స్మిత్‌‌ను నిజమైన ‘హీరో’గా అభివర్ణించిన ప్రధాని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ (FZ1073) విమానంలో కో-పైలట్ హఠాత్తుగా కత్తితో దాడి చేసి విమానాన్ని కిందకు దించేందుకు యత్నించగా, గాయపడిన స్మిత్ కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులు, సిబ్బంది సహాయంతో అతడిని అదుపు చేయగలిగారు. అనంతరం విమానం సౌదీలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రస్తుతం సౌదీ అరేబియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని భారత అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *