Breaking News

నాని ‘ది ప్యారడైజ్’కి ‘A’ సర్టిఫికెట్!

నేచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న పాన్-వరల్డ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. చిత్రంలో ఉన్న తీవ్రమైన యాక్షన్ సీన్లు, రక్తపాతం, బోల్డ్ కంటెంట్ కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు ‘A’ (అడల్ట్) సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే, ఓవర్సీస్ డిస్పాచ్, ప్రమోషనల్ పనుల ఆలస్యం కాకుండా ఉండేందుకు ఫైనల్ కట్ కంటే ముందే రఫ్ కట్ వెర్షన్‌ను…

Read More

బిగ్ బాస్ ట్విస్ట్: త్రిగుణ్‌కు నెక్‌టూనెక్‌ పోటీ ఇస్తున్న రోహిత్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. బిగ్ బాస్ పెట్టిన కొత్త రూల్స్ కారణంగా ఈసారి ఏకంగా 11 మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ముంగిట నిలిచారు. సాధారణ నామినేషన్ పద్ధతికి భిన్నంగా నిర్వహించిన ‘రోప్ టాస్క్’లో ఓడిపోయిన వారు నేరుగా నామినేట్ కాగా.. షాలిని, త్రిగుణ్, ఝాన్సీ, దేబ్జానీ, రాంప్రసాద్, ముఖేష్, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్‌లు నామినేషన్ లిస్టులోకి చేరారు. అమన్, వంశీ, నరేష్‌లకు…

Read More

బిగ్ బాస్ హౌస్‌లో శృతిమించుతున్న వివాదాలు

హైదరాబాద్: బిగ్ బాస్ తెలుగు షోలో వివాదాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కంటెస్టెంట్ల మధ్య వ్యక్తిగత దూషణలు హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా రోహిత్‌ను లక్ష్యంగా చేసుకుని త్రిగున్ చేస్తున్న నిరాధార ఆరోపణలు, ‘స్టిరాయిడ్స్ వాడుతున్నావని’ కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. ప్రత్యర్థి రెచ్చగొడుతున్నప్పటికీ రోహిత్ సహనంతో వ్యవహరించిన తీరు అభినందనలు పొందుతోంది. ఈ తరహా ప్రవర్తనపై వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మరోవైపు, ఎలాంటి ఆడియన్స్…

Read More

72 ఏళ్ల చరిత్రలో తొలిసారి: ఢిల్లీ దాటుతున్న జాతీయ చలనచిత్ర పురస్కార వేడుక

జాతీయ చలనచిత్ర పురస్కారాల (National Film Awards) ప్రదానోత్సవంలో దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి ఈ ఏడాది తెరపడనుంది. 1954లో ప్రారంభమైన నాటి నుంచి ఢిల్లీ వేదికగానే జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుక, చరిత్రలో తొలిసారిగా దేశ రాజధాని వెలుపల జరగబోతోంది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని గుజరాత్‌లోని ఏక్తా నగర్ (కెవాడియా)లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాన అంశాలు: డెబ్బై ఏళ్లకు పైగా ఢిల్లీకే పరిమితమైన ఈ వేడుకను ఇతర రాష్ట్రాలకు…

Read More

ఇందూరు ఊర పండుగలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ – బీజేపీ కార్పొరేటర్లు

నిజామాబాద్, ఆగస్టు 2: E6 tv NEWS శివ ఠాకూర్ నిజామాబాద్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించిన సాంప్రదాయ ఇందూరు ఊర పండుగలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో పాటు బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. నగరంలోని పలు దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, సంప్రదాయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేలాది మంది భక్తులతో కలిసి ఎమ్మెల్యే పండుగ ఉత్సవాల్లో పాల్గొని ప్రజలకు…

Read More

నిజామాబాద్ ‘ఊర పండుగ’ – తెలంగాణ జానపద సంస్కృతికి ప్రతీక

ఇందూరు ఆగస్టు 2: E6 tv NEWS (శివ ఠాకూర్). నిజామాబాద్, ఆగస్టు 2: తెలంగాణ జానపద సంస్కృతి, గ్రామదేవతల ఆరాధన, సర్వ సమాజ్ ఐక్యతకు ప్రతీకగా నిలిచే నిజామాబాద్ (ఇందూర్) ఊర పండుగను ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల రోజునే జరిగే ఈ ఉత్సవం శతాబ్దాల చరిత్రను కలిగి ఉండి, నగర ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసం, సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఊర పండుగ…

Read More

సంస్కృత సాహిత్యానికి మూలపురుషుడు వేదవ్యాసుడు

వ్యాసపూర్ణిమ సందర్భంగా మద్నూరు గురుకులంలో ఘనంగా కార్యక్రమం వేదవ్యాసుని జీవితం, సాహిత్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన డా. బి. వెంకట్. సంస్కృత  శ్లోకాలు, ప్రతిజ్ఞతో ఆకట్టుకున్న కార్యక్రమం మద్నూరు, జూలై 29: E6 tv NEWS (M. మస్నాజీ) సంస్కృత సాహిత్యానికి, అనంతమైన వైదిక వాఙ్మయానికి మూలపురుషుడు మహర్షి వేదవ్యాసుడేనని సంస్కృతభాషా ప్రచార సమితి నిజామాబాద్–ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ పద్యకవి డా. బి. వెంకట్ పేర్కొన్నారు.సంస్కృతభాషా ప్రచార సమితి, సంస్కృతభాషా పరిరక్షణ సమితి,…

Read More

“డైరెక్టర్ సీట్లలో యంగ్ హీరోలు.. టాలీవుడ్‌లో కొత్త రేంజ్ ప్రయోగాలు!”

హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. దర్శక నిర్మాతల కథల కోసం వేచి చూడకుండా, తమ ఐడియాలను స్వయంగా తెరకెక్కించేందుకు యంగ్ హీరోలు మెగాఫోన్ పడుతున్నారు. తాజాగా సుధీర్ బాబు, కార్తికేయలు తమ స్వీయ దర్శకత్వంలో కథానాయకులుగా నటిస్తూ సినిమాలు చేయబోతున్నారనే ప్రచారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విశ్వక్ సేన్ (‘కల్ట్’), రామ్ పోతినేని (RAPO 23), కిరణ్ అబ్బవరం తమ సొంత ప్రాజెక్టులతో దర్శకులుగా మారుతున్నట్లు ప్రకటించారు. హీరోలు దర్శకులుగా…

Read More

వాన కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ…

వర్షాభావంతో విలవిల్లాడుతున్న ఖరీఫ్ పంటలు – పెరుగుతున్న రైతుల ఆందోళన, ప్రభుత్వ చర్యలపై ఆశలు నిజామాబాద్, జూలై 24: (E6 tv NEWS, శివ ఠాకూర్-ప్రత్యేక కథనం) తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రారంభంలో కురిసిన వర్షాలతో ఉత్సాహంగా సాగు పనులు ప్రారంభించిన రైతులు, ప్రస్తుతం వర్షాభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండిపోతున్న పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది…

Read More

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి జులై 24: E6 tv NEWS ప్రతినిధి. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్  ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. కేటీఆర్  దీర్ఘాయుష్షుతో ప్రజలకు…

Read More