Ongole
బత్తలపల్లిలో అంగన్వాడీ ఉత్సవం
అంగన్వాడీ, ఆశా వర్కర్ల సేవలు సమాజానికి ఆదర్శం: మంత్రి సత్యకుమార్ బత్తలపల్లి, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి) అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆశా వర్కర్లు సమాజానికి అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవంలో మంత్రి…
ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జన ర్యాలీ
భజన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ మోహన్‌రెడ్డి, పోలీసు సిబ్బంది మద్నూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి)కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణపతి నిమజ్జన ర్యాలీని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. గణపతి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులు ర్యాలీగా నిమజ్జనానికి తరలించారు. ర్యాలీలో మద్నూర్ పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా పాల్గొని భక్తులకు భద్రత కల్పించారు. ఎస్ఐ మోహన్‌రెడ్డితో పాటు కానిస్టేబుళ్లు భక్తులతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు…
వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలపై శిక్షణ
భీంగల్, సెప్టెంబర్ 25; (E6tv NEWS: ప్రతినిధి) వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికల (VGPP), VBGRAMG పథకంపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో భీంగల్, వేల్పూర్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.శిక్షణలో భాగంగా బాబానగర్ గ్రామానికి సంబంధించి సామాజిక పటము, వనరుల పటము రూపొందించి, ప్రజల భాగస్వామ్యంతో PRA పద్ధతిలో గ్రామంలో అవసరమైన పనులను ఎలా గుర్తించాలనే అంశాలపై అవగాహన కల్పించారు….
రాష్ట్రంలోనే ప్రత్యేకం ఇందూరు వినాయకుడి శోభాయాత్ర
దుబ్బ చౌరస్తా నుంచి వినాయకుల బావి వరకు అంగరంగ వైభవంగా రథయాత్ర ఇందూరు, సెప్టెంబర్ 25: (E6tv NEWS: శివ ఠాకూర్). రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ఇందూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని దుబ్బ చౌరస్తాలో శుక్రవారం వినాయకుడి రథయాత్రను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ప్రజల్లో ఐక్యతను పెంపొందించేందుకు బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపుతో…
గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు
నిర్మల్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ 25న నిర్మల్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని బాసర జోన్–2 డీఐజీ ఆర్. భాస్కరన్, IPS పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన డీఐజీకి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై పోలీస్…
క్రీడలకు ఆర్డీటీ మంచు ఫెర్రర్ ఒక వరం
క్రికెట్లో రాణించి జిల్లా, రాష్ట్రానికి పేరు తీసుకురావాలి రాయదుర్గంలో క్రికెట్ సెలక్షన్స్‌కు భారీ స్పందన రాయదుర్గం, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి). కరువు నేల అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, ప్రతిభను వెలికితీసేందుకు ఆర్డీటీ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. క్రీడలకు ఆర్డీటీ, మంచు ఫెర్రర్ వంటి సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. క్రికెట్లో రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికై…
పొతంగల్, ఎత్తోండా సొసైటీల్లో నామినేటెడ్ చైర్మన్ ఎన్నిక వద్దు
రైతులు, సొసైటీ సభ్యుల ద్వారానే ఎన్నిక నిర్వహించాలి సొసైటీల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలిబాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్పీ నేతల డిమాండ్ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్పీ నేతల డిమాండ్ పోతంగల్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి)నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పోతంగల్ సొసైటీ, కోటగిరి మండలం ఎత్తోండా గ్రామ సొసైటీల్లో నామినేటెడ్ విధానంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించవద్దని ఆర్ఎస్పీ రాష్ట్ర సహాయ కార్యదర్శి యార్లగడ్డ సాయిబాబా, ఆర్ఎస్పీ నాయకులు బాలు డిమాండ్…
చిన్నారుల ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి
రిమ్స్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో సమీక్ష ఫైర్ సేఫ్టీ, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, విద్యుత్ భద్రతపై అధికారుల దృష్టి మాక్ డ్రిల్స్ నిర్వహించి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచన నిజామాబాద్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: శివ ఠాకూర్). ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ…
అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష
ఇందూర్, సెప్టెంబర్ 23: (E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సౌత్ మండలంలో ఇటీవల కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మంజూరైన రూ.1.25 కోట్లతో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. మినీ ట్యాంక్‌బండ్ నిర్వహణ…
వర్ణి మండల MRPS నూతన కమిటీ ఎన్నిక
వర్ణి, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి)బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి సోంపూర్ పోచిరాం ఆధ్వర్యంలో, జిల్లా ఇన్చార్జి మాసాయిపేట యాదగిరి ఆదేశాల మేరకు వర్ణి మండల కేంద్రంలో MRPS మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా సంగోల్లా అశోక్, ఉపాధ్యక్షులుగా సమేనా కాశీరామ్, ప్రధాన కార్యదర్శిగా నెమ్లి ప్రభాకర్‌ను ఎంపిక చేశారు. కార్యదర్శులుగా చిట్టోళ్ల శ్రీనివాస్, ఫట్లా సాయిలు, కోశాధికారిగా ఈబత్వార్ మారుతీ, ప్రచార కార్యదర్శిగా సిందిగిడి రవిలను నియమించారు.సలహాదారులుగా కొరోల్లా సాయిలు, మెరుగు…

