Breaking News

జర్నలిస్ట్ బసవరాజుపై కేసులు ఎత్తివేయాలి

మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు డిమాండ్ నిజామాబాద్, సెప్టెంబర్ 23: (E6tv NEWS: ప్రతినిధి). జర్నలిస్ట్ బసవరాజుపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విఠల్‌రావు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా నిరంతరం వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ…

Read More

ఏర్గట్లలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ఏర్గట్ల, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి). ఏర్గట్ల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. సల్వాల సంధ్య, రెండ్ల శ్రావణి తదితరులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అనారోగ్యంతో వైద్య చికిత్స చేయించుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందుతోందన్నారు. వైద్య చికిత్సకు సంబంధించిన బిల్లులను సమర్పిస్తే, అర్హత మేరకు సీఎం…

Read More

రాజకీయ పరిస్థితులపై కార్యకర్తలకు అవగాహన

పుట్టపర్తి, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి).శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని కార్మిక కర్షక భవన్‌లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లో భాగంగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ వి. రాంభూపాల్ హాజరై ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, స్థానిక రాజకీయ పరిణామాలపై పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వి. రాంభూపాల్ మాట్లాడుతూ, స్థానిక రాజకీయ పరిస్థితులను కార్యకర్తలు లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. ఓట్ల…

Read More

పోచారంలో ఆరుగురికి రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ

పోచారం, సెప్టెంబర్ 22: (E6tv NEWS: ప్రతినిధి). పోచారం గ్రామంలో సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ ఆధ్వర్యంలో రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గతంలో పెన్షన్ పొందుతూ, వివిధ కారణాలతో నిలిచిపోయిన ఆరుగురు అర్హులైన లబ్ధిదారులకు తిరిగి పెన్షన్లు మంజూరు కాగా, వాటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెన్షన్లకు సంబంధించిన సమస్యలను…

Read More

నిజాయితీకి పోలీస్‌స్టేషన్‌లో సత్కారం

బంగారు నెక్లెస్‌ను పోలీసులకు అప్పగించిన ముగ్గురికి సీఐ జయనాయక్ ఘన సన్మానంఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నగదు పారితోషికం ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి) రోడ్డుపై లభించిన బంగారు నెక్లెస్‌ను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న ముగ్గురు వ్యక్తులను ధర్మవరం టూ టౌన్ సీఐ జయనాయక్ ఘనంగా సన్మానించారు. ఆటో డ్రైవర్ నరసింహులు, కుమ్మర రామాంజనేయులు, సిద్ధమ్మలను శాలువాలతో సత్కరించి, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నగదు పారితోషికాన్ని అందజేశారు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం నుంచి…

Read More

బీఎస్పీ జిల్లా కార్యదర్శిగా మాల్యవంతం రాంప్రసాద్

ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి) బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శిగా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలానికి చెందిన బహుజన నాయకుడు మాల్యవంతం రాంప్రసాద్ నియమితులయ్యారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ మార్గదర్శకత్వంలో జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ ఈ నియామకాన్ని ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్, రాష్ట్ర…

Read More

కుల సంఘాలే అర్హులను నిర్ణయించాలి

రుద్రూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం రుద్రూరు, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). రుద్రూరు మండల కేంద్రంలో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు కదలిక వచ్చింది. సోమవారం నిర్వహించిన గ్రామసభలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై చర్చ జరిగింది. కుల సంఘాల ప్రతినిధులు తమ సంఘాల్లోని అర్హులైన నిరుపేదల జాబితాను అధికారులకు అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కుల సంఘాల నుంచి అర్హుల జాబితా గ్రామంలో ఉన్న కుల సంఘాలు…

Read More

మండల సమాఖ్యలపై మోడల్ శిక్షణ

రానున్న ఐదేళ్లలో సంఘాల అభివృద్ధికి విజన్ రూపొందించుకోవాలి విజన్ సాధనకు పక్కా వ్యూహాలు రూపొందించుకోవాలని సూచన మద్నూర్, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, వీఓఏలకు మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. NRLM స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ఎస్. రమాదేవి, ఓ. కవిత శిక్షణను అందించారు. ఐదేళ్ల అభివృద్ధికి విజన్ రానున్న ఐదేళ్లలో స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు ఏ స్థాయిలో…

Read More

మహిళల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు

మహా అన్నదాన కార్యక్రమం నిర్వహణ జమ్మికుంట, సెప్టెంబర్ 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణం 6వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీ, 7వ వార్డు దుర్గా కాలనీలో శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలంతా కలిసి తొలిసారిగా శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో…

Read More

తానూర్‌లో ఇంటిపై పిడుగుపాటు

తృటిలో తప్పిన ప్రాణాపాయం.. భారీగా ఆస్తి నష్టం తానూర్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో సోమవారం కురిసిన భారీ వర్షం సమయంలో ఓ మూడు అంతస్తుల ఇంటిపై పిడుగు పడింది. పిడుగుపాటు ధాటికి ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నారులు, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పిడుగు ప్రభావంతో ఇంట్లోని విద్యుత్ వైరింగ్ పూర్తిగా దెబ్బతినడంతో పాటు ఫ్యాన్లు, బల్బులు, ఫ్రిజ్, టీవీ తదితర…

Read More