International
ఫ్లై దుబాయ్ విమానంలో పైలట్‌పై కత్తితో దాడి
దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ (FZ1073) విమానంలో గాల్లో ఉండగానే అనూహ్య భయానక సంఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియా మీదుగా 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా, ఒమన్ జాతీయుడైన కో-పైలట్ సడన్‌గా ప్రధాన పైలట్ (భారతీయ జాతీయుడు స్మిత్ మచ్చార్) పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చివేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా 17,000 అడుగుల కిందకు పడిపోవడంతో పాటు విమానం అపహరణకు గురైనట్లు సూచించే ‘7500’ ఎమర్జెన్సీ కోడ్…
అమెరికా వీసా షాక్: ఇంటర్వ్యూకి 18 నెలల వెయిటింగ్!
అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ కాలం చుక్కలు చూపిస్తోంది. అమెరికా గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ (GAO) విడుదల చేసిన తాజా ఫెడరల్ ఆడిట్ నివేదిక ప్రకారం… భారత్‌లో విజిటర్ వీసా ఇంటర్వ్యూ కోసం సగటున 346 రోజులు (దాదాపు ఏడాది) వేచి చూడాల్సి వస్తోంది. కరోనాకు ముందు కేవలం 42 రోజులుగా ఉన్న ఈ సమయం ఇప్పుడు ఎనిమిది రెట్లకు పైగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఏకంగా 14.55 లక్షల…
నేపాల్‌లో వర్ష బీభత్సం.. 24 మంది మృతి
నేపాల్‌ను భారీ వర్షాలు తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా, మరొక 14 మంది గల్లంతయ్యారు. వర్షాల ధాటికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడమే కాకుండా వేలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివాసాలపైకి ఒక్కసారిగా మట్టి, రాళ్లు విరిగిపడటంతో స్థానికులు భయాందోళనతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో…
అభివృద్ధే మా అజెండా.. ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం
25 ఎకరాల్లో త్వరలో ఇళ్ల పట్టాల పంపిణీ – మహాదేవపల్లిలో రూ.45 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ పెనుకొండ, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. ప్రజలతోనే కూటమి ప్రభుత్వం.. ప్రజల కోసమే పాలన సాగుతోందని తెలిపారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని…
సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమే
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలి: పీడీఎస్‌యూ బోధన్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికీ విద్రోహ దినమేనని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి విద్యారంగ సమస్యలపై విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని మధుమలంచ జూనియర్ కళాశాలలో పీడీఎస్‌యూ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో “1948 సెప్టెంబర్ 17 విద్రోహ దినం” సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌పై స్టే.. బీఆర్ఎస్ ధర్నా వెనుక అసలు కథ ఏమిటి?
పేదింటి ఆడబిడ్డల పెళ్లి సాయంపై న్యాయపరమైన ప్రతిష్టంభన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో లబ్ధిదారుల్లో ఆందోళన.. ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు పథకం రద్దు కాలేదా? స్టే మాత్రమేనా? అసలు వివాదం ఏమిటి? నిజామాబాద్, ఆగస్టు 17: E6tv NEWS (శివ ఠాకూర్). తెలంగాణ లో పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలు ప్రస్తుతం రాజకీయ, న్యాయపరమైన చర్చకు కేంద్రంగా మారాయి. ఈ పథకాల అమలుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ఇటీవల మధ్యంతర…
ప్రపంచానికి మరో చమురు గండం: సౌదీపై హూతీల నావికా దిగ్బంధం.. పెరుగుతున్న పెట్రో మంటలు!
రియాద్: పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు సముద్ర మార్గాలకు సైతం విస్తరిస్తున్నాయి. యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై నావికా దిగ్బంధం (Naval Blockade) విధిస్తున్నట్లు చేసిన సంచలన ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సౌదీకి వ్యతిరేకంగా సముద్ర మార్గాలను మూసివేస్తామన్న హూతీల బెదిరింపులను సౌదీ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ నౌకలు, ప్రయోజనాల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏంటి ఈ నావికా దిగ్బంధం? ఇప్పటికే అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా…
పశ్చిమాసియాలో దహించుకుపోతున్న యుద్ధ జ్వాలలు: వైట్ హౌస్‌ను వణికిస్తున్న యుద్ధ వ్యయం.. ఇరాన్‌పై అమెరికా విరుచుకుపాటు!
వాషింగ్టన్ / టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అత్యంత భయానక స్థాయికి చేరుకున్నాయి. అమెరికా – ఇరాన్ మధ్య చెలరేగిన యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్‌పై అమెరికా దళాలు వరుసగా 11వ రోజు రాత్రి కూడా సంచలన స్థాయిలో వైమానిక దాడులు జరిపాయి. డ్రోన్ నిల్వ కేంద్రాలు, విమాన హాంగర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికాకు $37.5 బిలియన్ల భారం! ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధం వల్ల అమెరికా ఖజానాపై…
జనరిక్ ఔషధాలపై 200% వరకు పన్నులు విధిస్తాం: ట్రంప్ సంచలన ప్రకటన.. భారత్‌కు పెను ముప్పు!
వాషింగ్టన్: భారతీయ ఫార్మా రంగానికి దిగ్భ్రాంతి కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై (Generic Drugs) భవిష్యత్తులో ఏకంగా 200 శాతం వరకు టారిఫ్‌లు (దిగుమతి సుంకాలు) విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఔషధ తయారీ రంగాన్ని తిరిగి అమెరికాలోనే నెలకొల్పడమే (Reshore) లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. టారిఫ్‌ల పెంపు షెడ్యూల్ ఇదే! తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’…
ప్రపంచం అత్యంత అస్థిరంగా ఉంది.. భారత్-ఆసియాన్ సహకారం మరింత పెరగాలి: విదేశాంగ మంత్రి జైశంకర్!
మనీలా (ఫిలిప్పీన్స్): ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు అత్యంత సంక్షోభ పూరితంగా, అస్థిరంగా (Turbulent) ఉన్నాయని, వీటిని ఏ ఒక్క దేశం లేదా కూటమి ఒంటరిగా ఎదుర్కొనే పరిస్థితి లేదని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత్ – ఆసియాన్ (ASEAN) దేశాల మధ్య భాగస్వామ్యం, సహకారం మరింత బలోపేతం కావడం అత్యంతావశ్యకమని ఆయన ఉద్ఘాటించారు. మనీలా వేదికగా ‘ఆసియాన్-ఇండియా’ సదస్సు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న క్వాడ్ (Quad)…

