Breaking News

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యం

‘విద్యా వికాసం–విద్యా వాహిని’తో ప్రతిభకు ప్రోత్సాహం పర్యావరణ పరిరక్షణపై డ్రాయింగ్ పోటీలు.. విజేతలకు బహుమతులు ధర్మవరం, అక్టోబర్ 05:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే ‘విద్యా వికాసం–విద్యా వాహిని’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్…

Read More

ముగిసిన 2026 ఆసియా క్రీడలు: 85 పతకాలు గెలిచిన భారత్

జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా వైభవంగా జరిగిన 20వ ఆసియా క్రీడలు ఎట్టకేలకు ముగిశాయి. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు ఈ క్రీడలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించగా, తదుపరి 2030 ఎడిషన్‌కు ఆతిథ్యమివ్వనున్న ఖతార్ (దోహా) ప్రతినిధులకు ఆసియా క్రీడల లాంఛనప్రాయ టార్చ్ మరియు జెండాను అందజేశారు. ముగింపు వేడుకల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో చారిత్రక విజయం సాధించిన భారత షూటర్ నీరూ ధండా దేశ పతాకధారిగా వ్యవహరించారు. ఈ క్రీడల పతకాల పట్టికలో భారత్…

Read More

గాల్లో విమానాన్ని కూల్చేసే కుట్ర: ఫ్లైదుబాయ్ షాకింగ్ ఘటన!

దుబాయ్ నుంచి ఇస్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ (Flydubai 1073) విమానంలో తీవ్ర తీవ్రవాద కుట్ర వెలుగుచూసింది. విమానంలో సహ పైలట్ (ఫస్ట్ ఆఫీసర్)గా విధులు నిర్వర్తిస్తున్న ఒమన్ జాతీయుడు హమామ్ అల్-హమ్మమీ, భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నించాడు. ఇస్రాయెల్‌లోని బెన్ గురియాన్ విమానాశ్రయంలో విమానాన్ని ఏదైనా భవనాన్ని లేదా మరో విమానాన్ని ఢీకొట్టి 9/11 తరహా దాడికి ప్లాన్ చేసినట్లు నిందితుడు…

Read More

ట్రంప్ పోస్ట్‌లో ‘కంట్రీ’ గందరగోళం..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. బ్రెజిల్‌లో అక్టోబర్ 4న జరిగిన తొలి విడత అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఆయన చేసిన పోస్ట్ నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. బ్రెజిల్‌కు బదులుగా భారత్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నట్లు పోస్ట్ చేసిన ట్రంప్.. సుమారు 12.5 కోట్ల మంది (125 మిలియన్లు) ఓటేశారని, అంత పెద్ద సంఖ్యలో పోలింగ్ జరిగినా ఫలితాలు వెంటనే వెలువడ్డాయని పేర్కొన్నారు. డెట్రాయిట్, ఫిలడెల్ఫియా,…

Read More

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: భారత్ ‘బ్యాలెన్సింగ్’ యాక్ట్

దీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తన వ్యూహాత్మక ‘బ్యాలెన్సింగ్ యాక్ట్’ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఒకవైపు రష్యాతో కీలకమైన రక్షణ, ఇంధన మరియు వాణిజ్య సంబంధాలను కాపాడుకుంటూనే, మరోవైపు ఉక్రెయిన్‌తో నిరంతరం సంభాషణలు జరుపుతూ పాశ్చాత్య దేశాలతో దౌత్య భాగస్వామ్యాన్ని బలపరుచుకుంటోంది. ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు, ఆహార ధాన్యాల సరఫరా, బ్లాక్ సీ వాణిజ్యం మరియు షిప్పింగ్ మార్గాలపై తీవ్ర ప్రభావం పడుతున్న తరుణంలో, భారత్ తన జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూనే…

Read More

పశ్చిమ ఆసియా:యెమెన్‌లో భారీ దాడులు

మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే లక్ష్యంతో యెమెన్ ప్రభుత్వం వారిపై భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభించగా, దానికి ప్రతిగా సౌదీ అరేబియాలోని ‘సౌదీ అరామ్‌కో’ లక్ష్యాలుగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి దౌత్య పరిష్కారానికి మొగ్గు చూపుతూనే, అవసరమైతే కఠిన ప్రతిస్పందనకు సిద్ధమని హెచ్చరించారు. రెడ్ సీ, బాబ్ ఎల్-మండేబ్ వంటి కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో…

Read More

శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కన్వీనర్‌గా రాచర్ల రామకృష్ణ

చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ కన్వీనర్‌గా చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన జర్నలిస్టు రాచర్ల రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎం.ఎస్.పి. రాష్ట్ర మాజీ అధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా ఇన్‌చార్జి బాయకాటి బెనర్జీ ప్రకటించారు. శనివారం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఆవరణలో చెన్నేకొత్తపల్లి మండల ఎం.ఆర్.పి.ఎస్. అధ్యక్షులు అర్జునప్ప మాదిగ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాప్తాడు…

Read More

భారత్-అమెరికా ట్రేడ్ వార్…ట్రేడ్ డీల్ లేటెస్ట్ ఎనాలసిస్!

భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) చుట్టూ ఉన్న ఆటంకాలు ఇంకా తొలిగిపోలేదు. రష్యాపై అమెరికా ఆంక్షల చట్టం, సెక్షన్ 301 కింద సుంకాల ప్రక్రియ, కొనుగోలు కట్టుబాట్లు మరియు ఆర్థిక సార్వభౌమాధికారానికి సంబంధించిన పలు అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతుండటమే ఈ ఆలస్యానికి కారణమని వాణిజ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ స్పందిస్తూ.. చర్చలు చివరి దశకు చేరుకున్నప్పటికీ, ఈ చిక్కుముడులు విప్పే వరకు…

Read More

ఎబోలా మరొక కోవిడ్ కాదా?కాంగోలో 4 వేలు దాటిన మృతుల సంఖ్య!

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ప్రాణాంతక ఎబోలా మహమ్మారి వణికిస్తోంది. మే 15న తూర్పు కాంగోలో వెలుగుచూసిన ఈ బుండిబుగ్యో వైరస్ వ్యాప్తి రోజురోజుకీ ఉధృతమవుతూ దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఎబోలా సంక్షోభంగా మారింది. ఇప్పటివరకు 8,300 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడగా, మృతుల సంఖ్య ఏకంగా 4,018కి చేరిందని ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటూరి, నార్త్ కివు ప్రావిన్సులతో పాటు మొత్తం ఏడు ప్రావిన్సులకు ఈ వైరస్ విస్తరించడంతో పరిస్థితులు…

Read More

ఫ్లైదుబాయ్‌ విమాన ఘటనపై ఇరాన్ హస్తం ఉందంటూ ట్రంప్ !

గత నెల 30న దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో జరిగిన కత్తిపోట్ల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఘటన వెనుక ఇరాన్ ప్రమేయం ఉండవచ్చని వైట్‌హౌస్ ప్రెస్ మీట్‌లో అనుమానం వ్యక్తం చేశారు. ఒమన్‌కు చెందిన కో-పైలట్‌కు ఇరాన్‌‌తో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోందని, దర్యాప్తులో గనుక ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు తేలితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కాక్‌పిట్‌లో కో-పైలట్…

Read More