Breaking News

చిన్నారులకు ఆశీర్వాదం అందించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఎల్లారెడ్డి, అక్టోబర్ 23 (E6tv న్యూస్).

ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు ముత్యం కుమార్తెల నూతన వస్త్రధారణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించి, వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుక సందడిగా సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *