భారత విమాన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ (Smit Machchhar) త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితంలోకి రావాలని కోరుతూ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ ప్రతినిధి బోయ నగేష్ గారి ఆధ్వర్యంలో, చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం తరఫున ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు:
- చార్మినార్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముజీబుల్లా షరీఫ్
- తెలంగాణ రాష్ట్ర రజక కార్పొరేషన్ వైస్ చైర్మన్ బంగారు బాబు
- కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ ముదిరాజు, బి. మధుమోహన్, వాగ్గు పవన్, సందీప్, శ్రీకాంత్, గణేష్ రాథోడ్, వినోద్ తదితర చంద్రాయణగుట్ట నియోజకవర్గ సీనియర్ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

