Breaking News

టీవీకేకు రాష్ట్ర పార్టీ హోదా, ‘విజిల్’ గుర్తు కేటాయింపు

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) టీవీకేను రాష్ట్ర పార్టీగా అధికారికంగా గుర్తించడంతో పాటు, పార్టీకి ‘విజిల్’ (Whistle) గుర్తును కేటాయించింది.

మరోవైపు అక్టోబర్ 6న జరగనున్న ఉప ఎన్నికల కోసం టీవీకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మదురాంతకం నియోజకవర్గం నుంచి కె. మరగతం కుమరవేల్‌, ధారాపురం నుంచి పి. సత్యబామాను బరిలోకి దింపుతున్నట్లు వెల్లడించింది. వీరిద్దరూ గతంలో అన్నాడీఎంకే (AIADMK) ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉన్న నేతలే కావడంతో తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఎన్నికల గుర్తు ఖరారు కావడం, సీనియర్ నేతలను బరిలోకి దింపడంతో తమిళనాడులో టీవీకే తన బలాన్ని మరింత పెంచుకునే దిశగా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *