Breaking News

టైగర్ ష్రాఫ్ ఫైరింగ్ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ ‘డెడ్ లెటర్ బాక్స్’

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ దాడికి ఉపయోగించిన ఆయుధాలను అమృత్‌సర్‌లోని ఒక ప్రాంగణం నుంచి “డెడ్ లెటర్ బాక్స్” విధానం ద్వారా సేకరించినట్లు విచారణలో వెల్లడైంది. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కలవకుండా, ముందుగా అనుకున్న ప్రదేశంలో వస్తువులను పెట్టి వెళ్లడాన్ని ‘డెడ్ లెటర్ బాక్స్’ పద్ధతి అని పిలుస్తారు. నిందితులు కునాల్, సుమిత్ రెండు వారాల క్రితం అమృత్‌సర్ వెళ్లి ఈ ఆయుధాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఎన్‌క్రిప్టెడ్ యాప్ ద్వారా అనిల్ పండిత్ అనే వ్యక్తి అందించిన సమాచారం ఆధారంగానే వీరు ఆయుధాలను పొందినట్లు సమాచారం.

ఈ ఆయుధాలను ముంబైకి చేరవేసేందుకు కునాల్ తన ప్రేయసి రాధా, ఆమె స్నేహితురాలు బబితలను ఉపయోగించుకున్నాడు. సోనెపట్ జైలు నుంచి ఇటీవల విడుదలైన కునాల్‌కు, ఆయుధాలు రవాణా చేసినందుకు అనిల్ పండిత్ రూ. 80,000 వరకు చెల్లించగా, అందులో రూ. 10,000 నుండి 12,000 ఆ మహిళలకు ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఆదివారం జుహులో టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన ఈ దాడిలో నటుడు తృప్తిలో ప్రమాదం నుండి బయటపడగా, ఆయన డ్రైవర్‌కు గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని కోటాలో పట్టుబడిన ముగ్గురు నిందితులను పోలీసులు ముంబైకి తరలించి విచారిస్తున్నారు. కాగా, నిందితులు మొదట వేరే ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీని లక్ష్యంగా చేసుకోవాలని భావించారని, అయితే అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉండటంతో టైగర్ ష్రాఫ్‌ను టార్గెట్ చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *