Breaking News

పరవాడ ఫార్మాసిటీ అరబిందోలో అగ్నిప్రమాదం..

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా పరిశ్రమలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్‌-15 ప్రొడక్షన్ బ్లాక్‌లో ఉదయం 5:30 గంటలకు ఐసోప్రొపైల్ బ్యాచ్‌ను ప్రారంభిస్తున్న సమయంలో మరియు క్లీనింగ్ ఆపరేషన్స్ జరుగుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకోవడంతో పాటు మంటలు ఎగిసిపడటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో యాజమాన్యం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా రసాయన చర్య కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తుండగా, అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.

హోం మంత్రి అనిత ఆరా.. అరబిందో పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఆమె వెంటనే అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *