Breaking News

కేటీఆర్‌కు సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ!

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు క్షమాపణలు తెలిపారు. గతంలో కేటీఆర్, ఆయన కుటుంబసభ్యులపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రాజకీయ విమర్శల్లో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు.

ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తగిన వివరణ లేకుండా తనను పదవి నుంచి తొలగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కొండా దంపతులు, తిరిగి తమ పాత పార్టీ అయిన బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. కేటీఆర్‌తో ఉన్న విభేదాలను సరిదిద్దుకుని పార్టీలోకి పునరాగమనానికి మార్గం సుగమం చేసుకోవడంలో భాగంగానే ఈ సారీ చెప్పినట్లు విశ్లేషకులు భావిస్తుండగా, దీనిపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *