Breaking News

సూపర్-6 హామీల అమలుతో ప్రజలకు సంక్షేమ ఫలాలు: టీడీపీ అభ్యర్థులు

అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

27 నెలల్లో 90 శాతం హామీలు అమలు చేశామని వెల్లడి

చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 30 (E6 TV న్యూస్).

అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, సుపరిపాలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెన్నేకొత్తపల్లి ఎంపీటీసీ-1 అభ్యర్థి మాడెం సూర్యనారాయణ రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థిని ఎం. శివలక్ష్మి పేర్కొన్నారు.

శుక్రవారం (30-10-2026) శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన E6tv NEWS ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్-6 హామీల అమలుతో పాటు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నట్లు వివరించారు.

సంక్షేమ పథకాలపై అభ్యర్థుల వివరణ..

తల్లికి వందనం పథకం ద్వారా 42.69 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేశామని, ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 46.85 లక్షల మంది రైతులకు మూడు విడతల్లో రూ.12,485.41 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు.దీపం-2 పథకం ద్వారా ఇప్పటివరకు 5.1 కోట్ల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి రూ.3,942 కోట్లు ఖర్చు చేశామని, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు, విద్యార్థినులు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈ పథకానికి రూ.3,550 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

ఉద్యోగాలు, పెన్షన్లు, అన్న క్యాంటీన్లపై ప్రత్యేక దృష్టి..

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లు అభ్యర్థులు వివరించారు. మెగా డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్, ఏపీపీఎస్సీ ద్వారా సుమారు 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. మరో 10 వేల ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికి రూ.79 వేల కోట్లు అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 273 అన్న క్యాంటీన్ల ద్వారా ఇప్పటివరకు 11 కోట్ల మంది రూ.5కే భోజనం చేసినట్లు వివరించారు.

మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత..

రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న 23,450 రహదారులకు రూ.1,200 కోట్లు ఖర్చు చేసి మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, 39 వేల కిలోమీటర్ల మేర సీసీ, బీటీ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.జల్ జీవన్ మిషన్ 2.0 (అమరజీవి జలధార) పథకం ద్వారా రూ.30,156 కోట్లతో 27 లక్షల కుటుంబాలకు సురక్షిత తాగునీటి కుళాయి కనెక్షన్లు కల్పించనున్నట్లు తెలిపారు. అమృత్ 2.0 కింద రూ.10,319 కోట్లతో 281 ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో తాగునీరు, డ్రైనేజీ, చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

బీసీల సంక్షేమానికి ప్రాధాన్యత..

బీసీలకు చట్టసభల్లో 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించామని, బీసీ రక్షణ చట్టం-2026 రూపకల్పన చేపట్టినట్లు అభ్యర్థులు తెలిపారు. బడ్జెట్‌లో బీసీలకు రూ.1.37 లక్షల కోట్లు కేటాయించామని, వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.32,533 కోట్లతో 117 లక్షల మందికి ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు.కూటమి ప్రభుత్వం స్థిరంగా కొనసాగితేనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని వారు అభిప్రాయపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో టీడీపీ శ్రేణులు..

ఈ సందర్భంగా చెన్నేకొత్తపల్లి ఎంపీటీసీ-1 స్థానానికి టీడీపీ అభ్యర్థి మాడెం సూర్యనారాయణ రెడ్డిని, మండల జడ్పీటీసీ స్థానానికి అభ్యర్థిని ఎం. శివలక్ష్మిని గెలిపించాలని కోరుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చెన్నేకొత్తపల్లి మండల కన్వీనర్ ముత్యాల రెడ్డి, మాజీ ఎంపీపీ అంకె అమరేంద్ర, వై. చెన్నకేశవ గౌడ్, వడ్డే దుర్గ, డీలర్ రామంజి, లక్ష్మీనరసమ్మ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *