Breaking News

ఏర్గట్ల మండలంలో అక్రమ ఇసుక బహిరంగ వేలం

ఆగస్టు 7న తహసీల్దార్ కార్యాలయంలో వేలం నిర్వహణ

బట్టాపూర్‌లో స్వాధీనం చేసుకున్న 40 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక వేలానికి సిద్ధం

ట్రిప్పుకు కనీస ధర రూ.2,000గా నిర్ణయం

వేలంలో పాల్గొనాలంటే రూ.10,000 ధరావత్తు తప్పనిసరి

వేలానికి ముందు ఇసుక నిల్వలను పరిశీలించే అవకాశం

ఆసక్తి గల వారు ఆగస్టు 7 ఉదయం 11:30 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి హాజరు కావాలని సూచన

ఏర్గట్ల, ఆగస్టు 5 (E6 tv న్యూస్  ప్రతినిధి).
ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్న అక్రమ ఇసుకను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు తహసీల్దార్ కార్యాలయం ప్రకటించింది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ చేసిన సుమారు 40 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను ఆగస్టు 7, 2026 (శుక్రవారం) ఉదయం 11:30 గంటలకు ఏర్గట్ల తహసీల్దార్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ప్రభుత్వం ఒక ట్రాక్టర్ ట్రిప్పు ఇసుకకు కనీస ధర రూ.2,000గా నిర్ణయించిందని, ఈ ధరను ఆధారంగా చేసుకుని వేలం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు తప్పనిసరిగా రూ.10,000 ధరావత్తు (EMD) చెల్లించాలని సూచించారు.వేలంలో పాల్గొనే ఆసక్తి గల వారు వేలానికి ముందు ఈ రోజు మరియు రేపు బట్టాపూర్ గ్రామంలో ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించవచ్చని తహసీల్దార్ తెలిపారు.

ఈ వేలంలో అర్హులైన వారు పాల్గొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని తహసీల్దార్ ఏర్గట్ల మండలం ఒక ప్రకటనలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *