Breaking News

నేపాల్‌లో వర్ష బీభత్సం.. 24 మంది మృతి

నేపాల్‌ను భారీ వర్షాలు తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా, మరొక 14 మంది గల్లంతయ్యారు. వర్షాల ధాటికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడమే కాకుండా వేలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివాసాలపైకి ఒక్కసారిగా మట్టి, రాళ్లు విరిగిపడటంతో స్థానికులు భయాందోళనతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ప్రకృతి విపత్తుతో నేపాల్‌లో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపడుతూ, బాధితులకు ఆహారం, వైద్య సహాయం అందిస్తున్నాయి. వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో, ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *