Breaking News

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎలక్షన్స్: నేడే ఫలితాల వెల్లడి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (UoH) విద్యార్థి యూనియన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం అత్యంత ఉత్కంఠభరితంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసిన పోలింగ్‌లో దాదాపు 5,900 మంది విద్యార్థులకు గానూ 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 9 కేంద్ర పదవులతో పాటు 13 స్కూళ్ల పరిధిలోని 59 స్కూల్ బోర్డు కౌన్సిలర్ స్థానాల కోసం 220 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభించామని, రాత్రికి ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

ఈసారి వర్సిటీ పోరు మూడు ప్రధాన కూటముల మధ్య హోరాహోరీగా సాగింది. లెఫ్ట్-అంబేడ్కరైట్ కూటమి (SFI, ASA, AISA, DSU, TSF) తరఫున అధ్యక్ష అభ్యర్థిగా దిల్షాదా రైహాన్, NSUI కూటమి (PDSU, MSF, NSUI, ఫ్రేటర్నిటీ) నుంచి కె.నవీన్ కుమార్, మరియు ABVP-SLVD కూటమి నుంచి నరేష్ పొడిశెట్టి పోటీపడ్డారు. క్యాంపస్ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *