Breaking News

రేవంత్ సిరిసిల్ల వ్యూహం..

సిరిసిల్ల నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులతో నేరుగా రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిఫెన్స్‌‌లో పడ్డారనే చర్చ సాగుతోంది. సుదీర్ఘకాలంగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్, నియోజకవర్గంలో జరిగిన శాశ్వత అభివృద్ధి పనులను చెప్పుకోవడానికి బదులు ఆయన పీఆర్ టీమ్ ద్వారా వ్యక్తిగత సహాయాల ప్రచారాన్ని తెరపైకి తీసుకురావడం అభద్రతా భావానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి.

సిరిసిల్ల స్థానిక మహిళా క్రికెటర్‌కు సాయంతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు చెందిన వ్యక్తికి గల్ఫ్ సహాయం చేస్తానంటూ కేటీఆర్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించుకున్నారు. రేవంత్ తన నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని చూపించేందుకు ఈ ప్రచార స్టంట్ డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది. సీఎం రేవంత్ అభివృద్ధి నిధులతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటే, కేటీఆర్ ఇలాంటి తాత్కాలిక పిఆర్ హంగామాపై ఆధారపడటం ఆయన రాజకీయ గ్రాఫ్ పడిపోతోందనడానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *