Breaking News

రేవంత్ ఆస్తులపై విచారణ జరగాలి: కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో ఆస్తుల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందిస్తూ బహిరంగ సవాల్ విసిరారు. తమ కుటుంబ ఆస్తులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణలో తమది తప్పుగా తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. 2006లోనే తాను హోటల్ వ్యాపారం ప్రారంభించానని, వ్యాపారం చేయడం నేరం కాదని పేర్కొంటూ ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టంగా వెల్లడించానని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆత్మహత్య చేసుకున్న 35 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు, సీఎం పర్యటన కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమై తీవ్ర నిరాశ మిగిల్చిందని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తున్నందుకే తమ కుటుంబంపై బురద జల్లుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని మండిపడ్డారు. హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *