Breaking News

సముద్రంలో గల్లంతైన ముగ్గురు విద్యార్థులు మృతి:విశాఖ

విశాఖపట్నం సముద్ర తీరానికి విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. నిన్న ప్రశాంత్ అనే విద్యార్థి మృతదేహం లభించగా, నేడు నితీష్, సూర్యల మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. పోలీసులు, గజ ఈతగాళ్లు చేపట్టిన గాలింపు చర్యల అనంతరం ముగ్గురి మృతదేహాలు లభ్యం కావడంతో గాలింపునకు ముగింపు పలికారు.

కళ్లముందే ముగ్గురు యువకులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పర్యాటకులు, ముఖ్యంగా యువత ప్రమాదకర ప్రాంతాల్లో సముద్రంలోకి దిగవద్దని పోలీసులు, హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *