వైసీపీ నేతలపై గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రానున్న స్థానిక సంస్థల (పంచాయతీ) ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ స్థాయి నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యరపతినేని అంటే ఏంటో వైసీపీ వాళ్లకు చూపిస్తానని తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గురజాల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో తమ మద్దతుదారులే పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో పిడుగురాళ్లకు చెందిన పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరడం, తాజాగా యరపతినేని ఘాటు వ్యాఖ్యలతో గురజాల ప్రాంతంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
‘నేనేంటో చూపిస్తా’ అంటూ వైసీపీపై గురజాల ఎమ్మెల్యే యరపతినేని

