అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన (ATF) ధరలు గడిచిన దశాబ్ద కాలంలోనే అత్యధిక స్థాయికి చేరుకోవడంతో, ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఇంధన సర్ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంచిన ఛార్జీలు అక్టోబర్ 6, 2026 అర్ధరాత్రి నుండి అమలులోకి రానున్నాయి. దేశీయ మార్గాన్లలో ప్రయాణించే విమానాలకు దూరాన్ని బట్టి సర్‌ఛార్జీ రూ. 375 నుండి రూ. 1,300 వరకు ఉండగా, అంతర్జాతీయ సర్వీసులపై ఇది రూ. 1,000 నుండి రూ. 10,000 వరకు పెరగనుంది. పెరిగిన ఇంధన వ్యయ భారాన్ని తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీంతో ప్రయాణికులపై పడే అదనపు భారాన్ని పరిగణనలోకి తీసుకుని స్వల్పంగానే సవరణలు చేశామని సంస్థ తెలిపింది.

