ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి అగ్రనేతల కీలక సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ భేటీలో పాల్గొని తాజా రాజకీయ పరిణామాలు మరియు స్థానిక ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ స్థానాల సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో పాటించాల్సిన ప్రాధాన్యతలు, మరియు మూడు పార్టీల మధ్య క్షేత్రస్థాయి సమన్వయంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. కూటమి నేతల వరుస భేటీలతో స్థానిక పోరుకు కార్యాచరణ వేగవంతమైంది.
స్థానిక ఎన్నికలపై కూటమి అగ్రనేతల కీలక భేటీ!

