Breaking News

నవంబర్ నుంచి విద్యుత్ చార్జీల మోత!

తెలంగాణలో విద్యుత్ వినియోగదారులపై మరోసారి అదనపు భారం పడనుంది. డిస్కంలు రూ. 5,420 కోట్ల మేర ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేసుకునేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) అనుమతినిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు, సరఫరా సమయంలో డిస్కంలకు అయిన వాస్తవ వ్యయానికి, టారిఫ్ ద్వారా వచ్చిన రాబడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసేందుకు ఈ ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా నియంత్రణ సంస్థ నిర్ణయించిన నిబంధనల ప్రకారం రాబోయే బిల్లుల్లో విడతల వారీగా సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఆర్థిక లోటులో ఉన్న డిస్కంలకు ఊరటనిచ్చినప్పటికీ, గృహ, వాణిజ్య కేటగిరీ వినియోగదారుల నెలవారీ విద్యుత్ బిల్లులపై అదనపు భారం చూపనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *