ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో ఈ నెల అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లకు దేవస్థానం ఆహ్వానం పలికింది. ఉండవల్లిలో సీఎం, మంత్రులను కలిసి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వాన పత్రికలను అందజేశారు. పది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా భ్రమరాంబికా దేవి శైలపుత్రి, బ్రహ్మచారిణి మొదలు సిద్ధిదాత్రి వరకు నవదుర్గ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనుండగా, ప్రతిరోజూ చండీయాగం, రుద్రయాగంతో పాటు వివిధ వాహనాలపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. విజయదశమి రోజున పూర్ణాహుతి, శమీ పూజ అనంతరం పుష్కరిణిలో కన్నులపండువగా జరిగే తెప్పోత్సవంతో ఈ దసరా ఉత్సవాలు ముగుస్తాయి.
శ్రీశైలం దసరా ఉత్సవాలు: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు ఆహ్వానం!

