తమిళ సినీ రంగంలో అగ్ర నటుడిగా గుర్తింపు పొందిన ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ (తమిళనాడు పురోగమన పార్టీ) పేరుతో ఆయన కొత్త పార్టీని స్థాపించనున్నారని, ఈ మేరకు భారత ఎన్నికల సంఘం వద్ద పేరును కూడా నమోదు చేయించినట్లు తమిళ మీడియా కథనాలు వెలువరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘనవిజయం సాధించి సీఎం పీఠాన్ని దక్కించుకున్న నేపథ్యంలో, ధనుష్ కూడా రాజకీయ ప్రవేశానికి మొగ్గు చూపుతున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. అయితే, తన పార్టీ పేరు నమోదు లేదా రాజకీయ అరంగేట్రంపై ధనుష్ లేదా ఆయన బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
రాజకీయాల్లోకి నటుడు ధనుష్?

