Breaking News

విజయవాడలో వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్!

విజయవాడ (e6tv news): ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేయడంతో విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండియా కూటమి పిలుపునిచ్చిన ‘చలో రాజ్‌భవన్’ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఉన్న ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా అర్హులైన వారి పేర్లు తొలగించారని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లెనిన్ సెంటర్ నుండి రాజ్‌భవన్ వరకు యాత్ర చేపట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అయితే ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసిన పోలీసులు, షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్, వామపక్ష నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజ్‌భవన్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *