Breaking News

ఈ నెల 14న ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

విజయవాడ (e6tv news): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి రాష్ట్రపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. విజయవాడలో అక్టోబర్ 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనుండటం, సుమారు 20 నుండి 25 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్న తరుణంలో రాష్ట్రపతి పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, సీఎం మరియు రాష్ట్రపతి పర్యటనల సమన్వయం, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం మరియు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *