హైదరాబాద్ (e6tv news): హైదరాబాద్‌ను కలుపుతూ ప్రతిపాదించిన మూడు హై-స్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి భూసేకరణ ఆదేశాలు జారీ చేయలేదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణె హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం అలైన్మెంట్ (మార్గం) సర్వేలు మాత్రమే జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఎలాంటి భూసేకరణ ప్రతిపాదనలు పంపలేదని తెలిపారు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్‌తో చర్చించిన అనంతరం ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. మార్గాలు ఇంకా ఖరారు కాకముందే హై-స్పీడ్ రైల్ పేరుతో ఎక్కడైనా భూసేకరణ చేపడితే అది చట్టవిరుద్ధమని ఆయన హెచ్చరించారు. అలైన్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు, రైతులు/భూయజమానులకు తెలియజేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
బుల్లెట్ రైలు భూసేకరణపై కేంద్రం క్లారిటీ.. రైతులకు భరోసా!

