హైదరాబాద్‌లోని ప్రముఖ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో (OGH) అత్యవసర వైద్య సేవలు, మందుల కొరత తీవ్ర స్థాయికి చేరింది. ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోవడం మరియు నిధుల విడుదల పెండింగ్‌లో ఉండటంపై నిరసనగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (OMC JUDA) ఆధ్యర్యంలో హౌస్‌సర్జన్లు, పీజీ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సోమవారం నుంచి సమ్మె చేపట్టి ధర్నాకు దిగారు.
- సేవల ఉపసంహరణ: తమ విధుల నిరసనలో భాగంగా డాక్టర్లు సాధారణ సేవలు, ఎలెక్టివ్ ఓపీ సేవలు మరియు ఎలెక్టివ్ ఆపరేషన్ థియేటర్ (OT) సేవలను నిలిపివేశారు.
- పనిచేయని కీలక విభాగాలు: క్యాథ్ ల్యాబ్ (Cath Lab), కార్డియోథొరాసిక్ & వాస్కులర్ సర్జరీ (CTVS) విభాగం, అలాగే కిడ్నీ బాధితులకు అవసరమయ్యే CRRT సేవలు గడిచిన నాలుగు నెలలుగా పనిచేయడం లేదని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
- మందులు, పరికరాల కొరత: యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆర్తోపెడిక్ ఇంప్లాంట్స్, గ్యాస్ట్రోఎంటరాలజీ స్కోప్‌లు, సీటీ/ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ కాంట్రాస్ట్ పరికరాలతో పాటు అత్యవసర మందుల కొరత తీవ్రంగా ఉందని, ఇది రోగుల ప్రాణాల మీదకు తెస్తోందని పేర్కొన్నారు.
- నిధుల పెండింగ్: ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరియు ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని విన్నవించారు.

