Breaking News

చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల్లో నవతరం పార్టీ నామినేషన్

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పురపాలక సంఘ ఎన్నికల వేడి ప్రారంభమైంది. మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానానికి నవతరం పార్టీ అభ్యర్థిగా రావు రామ తులసి శనివారం తొలి నామినేషన్‌ను అత్యంత ఉత్సాహంగా దాఖలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లుకు తన నామినేషన్ పత్రాలను (ఒక సెట్) అధికారికంగా అందజేశారు. ప్రధాన పార్టీలకు ధీటుగా నవతరం పార్టీ కూడా చైర్‌పర్సన్ రేసులో నిలవడం, అందరికంటే ముందే మొదటి నామినేషన్ వేయడంతో చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల రేసు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *