Breaking News

ఏపీకి రైన్ అలర్ట్: మరో 3 రోజులు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు, కేరళ మీదుగా అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉండటం, దక్షిణ కర్ణాటక పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం ఇందులో విలీనం కావడంతో రాష్ట్రంలో ఈ వాతావరణ మార్పులు ఏర్పడ్డాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షాల సమయంలో ప్రజలు, రైతులు చెట్ల కింద ఉండరాదని, విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *