Andhra Pradesh
ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం.. 21 స్థానాల్లో పోటీ
ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ నిలిచింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 21 మంది అభ్యర్థులను పోటీకి దింపింది. వివరాల్లోకి వెళితే.. కడప కార్పొరేషన్ మేయర్ పదవికి, హిందూపురం మున్సిపాలిటీ ఛైర్పర్సన్ పదవికి ఎంఐఎం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు విజయవాడ కార్పొరేషన్‌లోని మూడు డివిజన్లలో, హిందూపురంలో ఐదు వార్డుల్లో, ఆదోనిలో ఏడు, రాయదుర్గ్‌లో మూడు, నంద్యాల, పెనుగొండ మున్సిపాలిటీల్లో ఒక్కో…
నవంబర్ నుంచి చింతలపూడి పనులు: చంద్రబాబు
రాష్ట్రంలోని కీలకమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను ఈ ఏడాది నవంబర్ నుంచి తిరిగి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అవసరమైన పర్యావరణ అనుమతులు ఇప్పటికే ఉన్నందున పనులు వెంటనే మొదలుపెట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికల పనులతో రాజకీయంగా తీరిక లేకుండా ఉన్నప్పటికీ, శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో రాష్ట్రంలో గుర్తించిన 36…
రాజకీయాల్లోకి బొత్స కోడలు పూజిత.. గరివిడి జడ్పీటీసీ అభ్యర్థిగా !
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తన కుటుంబం నుంచి మరో రాజకీయ వారసురాలిని రంగంలోకి దించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తన కోడలు బొత్స పూజితను విజయనగరం జిల్లా గరివిడి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుతూ బొత్స సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా ఓటర్లకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకితమై…
ఉత్తరాంధ్ర ‘ఆర్నాబ్’ తుపాను ముప్పు.. 27, 28 తేదీల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ‘ఆర్నాబ్’ తుపానుగా మారుతున్న నేపథ్యంలో, ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో గంటకు 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రం అలజడిగా…
మహిళా పోలీసుతో విడదల రజనిని తోపులాట…!
పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి బుల్లబ్బాయిని ఆమె నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో రజని బయటకు వచ్చి నిలదీశారు. ఈ సందర్భంగా చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక, విడదల రజనికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్ఐ అడ్డుకునే క్రమంలో జరిగిన తోపులాటలో రజని కిందపడిపోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునేందుకు…
ఉండవల్లిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల తాజా పరిణామాలపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలతో పాటు జడ్పీ చైర్పర్సన్ పదవుల సీట్ల సర్దుబాటు, కూటమి పార్టీల మధ్య సమన్వయం మరియు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో విస్తృతంగా సమాలోచనలు జరిపినట్లు సమాచారం. అయితే, ఈ…
టీడీపీ సింగిల్ విండో చైర్మన్ ముట్టమ్ ప్రభాకర్ కారు దగ్ధం
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం కురవపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ సింగిల్ విండో చైర్మన్ ముట్టమ్ ప్రభాకర్ కారును అర్ధరాత్రి సమయంలో దుండగులు దగ్ధం చేశారు. నలుగురు వ్యక్తులు పెట్రోల్ క్యాన్లతో వచ్చి, సీసీ కెమెరాలను పక్కకు తిప్పి మరీ కారుకు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. మాజీ చైర్మన్ సహదేవ రెడ్డి అవినీతిని గతంలో వెలికి తీయడం వలనే కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ దాడికి పాల్పడ్డారని ప్రభాకర్ ఆరోపించారు. నామినేషన్ల సమయంలో తమను భయభ్రాంతులకు…
కూటమి అభ్యర్థిగా పసుపులేటి నారాయణ నామినేషన్
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి చెందిన కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా పసుపులేటి నారాయణ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. నడికుడి సచివాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. నామినేషన్ సందర్భంగా గామాలపాడు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, ఆయనతో పాటు కూటమి నేతలు జంగా సురేష్, జంగా సైదులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు…
పల్నాడులో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్, ఎస్పీ వెల్లడి
పల్నాడు జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల అభ్యర్థులు స్వేచ్ఛగా ముందుకు వచ్చి నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 65కు పైగా జడ్పీటీసీ, 700కు పైగా ఎంపీటీసీ నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా కలెక్టర్‌ను లేదా పోలీసులను సంప్రదించవచ్చని స్పష్టం…
స్థానిక పోరుపై జగన్ వ్యాఖ్యలు!
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ… నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడటం, నామినేషన్ పత్రాలు చించివేయడం వంటి అరాచకాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికలను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ‘అమిక్స్ క్యూరీ’ ని నియమించాలని, కేంద్ర బలగాలను మోహరించి పూర్తిస్థాయిలో వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే…

