Breaking News

హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్

దుర్గామాత నిమజ్జనం సందర్భంగా ఘర్షణ.. కత్తితో యువకుడిపై దాడి కోరుట్ల, అక్టోబర్ 21 (E6tv న్యూస్). జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో జరిగిన హత్యాయత్నం ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పండుగ సందర్భంగా చోటుచేసుకున్న వివాదం ఘర్షణకు దారితీయడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. అర్బన్ కాలనీకి చెందిన గుద్దేటి రాజేందర్ (43) తన కాలనీలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

Read More

దేవి నవరాత్రుల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

ముంబాజీపేట్‌లో అమ్మవారికి ప్రత్యేక పూజలు.. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు ఎల్లారెడ్డి, అక్టోబర్ 21 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని ముంబాజీపేట్ గ్రామంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రుల ఉత్సవాల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. శ్రీ జగన్మాత సేవా సమితి సభ్యుల ఆహ్వానం మేరకు గ్రామంలోని అమ్మవారి మండపాన్ని సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి…

Read More

బిజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి నియామకం

జాతీయ స్థాయిలో తెలంగాణ యువ మహిళా నాయకురాలికి గుర్తింపు పార్టీ అభివృద్ధికి పూర్తి సమయం కేటాయిస్తా: కసిరెడ్డి సింధూరెడ్డి చందానగర్, అక్టోబర్ 21 (E6 tv NEWS). భారతీయ జనతా పార్టీ యువమోర్చా (బిజెవైఎం) జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా చందానగర్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్, బిజెవైఎం తెలంగాణ మాజీ ఉపాధ్యక్షురాలు కసిరెడ్డి సింధూరెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకాన్ని బిజెవైఎం జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు డాక్టర్ హెమాంగ్ జోషి మంగళవారం ప్రకటించారు. తెలంగాణకు చెందిన యువ మహిళా…

Read More

అమ్మవారి లడ్డూకు రూ.25,555.. మణిహారానికి రూ.24,100!

భక్తిశ్రద్ధల నడుమ దుర్గాభవాని అమ్మవారి ప్రసాదాల వేలం పది అవతారాల్లో అమ్మవారి దర్శనం.. చీరల వేలంలో భక్తుల పోటాపోటీ ఎల్లారెడ్డి, అక్టోబర్ 21 (E6tv న్యూస్ ప్రతినిధి). కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి 4వ వార్డులో త్రినేత్రి భవాని మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గాభవాని అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారికి సమర్పించిన పవిత్ర ప్రసాదాలు, చీరలు, మణిహారం వేలం నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు….

Read More

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య నిజామాబాద్, అక్టోబర్ 21 (E6tv న్యూస్: శివ ఠాకూర్). శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని అమరవీరుల…

Read More

ఈనెల 23న మున్నూరు కాపు దసరా ఆత్మీయ సమ్మేళనం

జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ నిజామాబాద్, అక్టోబర్ 21: (E6tv న్యూస్:శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లాలోని మున్నూరు కాపు కుటుంబాల ఐక్యత, ఆత్మీయతను పెంపొందించేందుకు ఈనెల 23వ తేదీన దసరా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు నిజామాబాద్ మాజీ మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తెలిపారు. ప్రగతినగర్ లోని మున్నూరు కాపు సంఘం భవనంలో నిర్వహించనున్న ఈ సమ్మేళనానికి జిల్లాలోని ప్రతి మున్నూరు కాపు కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఆయన…

Read More

మీనూరులో దసరా బంగారం సందడి

జమ్మి ఆకులను బంగారంగా భావించి పంచుకున్న గ్రామస్తులు మీనూరు, అక్టోబర్ 21 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీనూరు గ్రామంలో విజయదశమి పండుగ సందర్భంగా దసరా బంగారం సందడి నెలకొంది. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆప్యాయతను చాటుకున్నారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య సాగింది. జమ్మి ఆకులను…

Read More

ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట పోలీస్ బందోబస్తు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 20 (E6tv న్యూస్). శ్రీ సత్యసాయి జిల్లాలో అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు…

Read More

46 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ అభినందనీయం

బోధన్, అక్టోబర్ 19: (E6tv NEWS: ప్రతినిధి). దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 46 మందికి ట్రై సైకిళ్లు అందజేయడం గర్వకారణమని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. శాల గంగాధర్ అన్నారు.లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3200, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ చారిటబుల్ ట్రస్ట్, పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 46 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేయడం పట్ల ఆయన…

Read More

లింగంపేట్ మండలంలో లబ్ధిదారునికి CMRF చెక్కు పంపిణీ

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట – సాయిరాం యాదవ్ ఎల్లారెడ్డి, అక్టోబర్ 17 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలంలో బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును పంపిణీ చేశారు. లింగంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరాం యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి లబ్ధిదారునికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సాయిరాం యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి…

Read More