Breaking News

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

ముధోల్, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతంతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ దినేష్ తెలంగాణ రాష్ట్ర విమోచన ఉద్యమ చరిత్ర, ఆనాటి పోరాటాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ…

Read More

ముచ్కూరు గ్రామంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

మొక్కలు నాటి సేవా కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ నాయకులు భీమ్‌గల్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భీమ్‌గల్ మండలం ముచ్కూరు గ్రామంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొడిగేళ శ్రీనివాస్, ఉపసర్పంచ్ రమేష్, మండల ప్రధాన కార్యదర్శి పల్లికొండ ప్రసాద్లతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ భీమ్‌గల్ మండల అధ్యక్షుడు అరే రవీందర్…

Read More

భీంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

సంక్షేమ సమస్యలపై ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి భీంగల్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని భీంగల్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే ఎంపీడీవో కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల…

Read More

సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమే

తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలి: పీడీఎస్‌యూ బోధన్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికీ విద్రోహ దినమేనని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి విద్యారంగ సమస్యలపై విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని మధుమలంచ జూనియర్ కళాశాలలో పీడీఎస్‌యూ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో “1948 సెప్టెంబర్ 17 విద్రోహ దినం” సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

Read More

మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ కుటుంబానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పరామర్శ

డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌తో కలిసి కుటుంబ సభ్యులకు సానుభూతి మద్నూర్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మద్నూర్ మండల కేంద్రంలోని ప్రజ్ఞ కుమార్ స్వగృహానికి వెళ్లిన ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని…

Read More

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం

‘సార్‌తో సర్పంచ్ సాబ్’ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మద్నూర్, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి) మద్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ‘సార్‌తో సర్పంచ్ సాబ్’ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఎమ్మెల్యేతో కలిసి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు తమకు…

Read More

జుక్కల్‌లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జుక్కల్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ చరిత్రలో కీలకమైన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా జరిగాయి. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పాల్గొని జాతీయ జెండాకు…

Read More

తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు.. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. ముఖ్యంగా శనివారం (సెప్టెంబర్ 19) నుంచి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాతావరణ హెచ్చరికలు & ముఖ్య విశ్లేషణ: భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read More

స్థానిక సంస్థల ఎన్నికలపై అఖిలపక్ష సమావేశం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారుల చర్చ శ్రీ సత్యసాయి జిల్లా, చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి). రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియపై అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లకు సంబంధించిన అంశాలపై సమావేశంలో ప్రధానంగా…

Read More

కారులో పవర్ బ్యాంక్ పేలుడు: తృటిలో తప్పించుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు వెళ్తుండగా డోర్నకల్ ఎమ్మెల్యే రామ్‌చందర్ నాయక్‌కు ప్రమాదం తృటిలో తప్పిపోయింది. మహబూబాబాద్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామం సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్న పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలిపోవడంతో కారు కేబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యేను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం రామ్‌చందర్ నాయక్ మరొక వాహనంలో మహబూబాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

Read More